నేను ఎనిమిదవ క్లాసులో ఉన్నప్పుడనుకుంటాను ఆ పుస్తకం చదివాను. విపరీతంగా కదిలిపోయాను. ప్రపంచం ఇలా కూడా ఉంటుందా అని ఆశ్చర్యపోయాను. అదే పుస్తకాన్ని వరుసగా మూడు సార్లు చదివాను. కొన్ని పేజీలను మళ్ళీ మళ్ళీ చదివాను. ఎన్ని సార్లు చదివానో అన్ని సార్లు ఏడిచాను. అలాంటి జీవితాలు ఇంకెవరికీ ఉండకూడదని కోరుకున్నాను.ఆనాడు నా మనసును కదిలించి,చెరగని ముద్ర వేసి, ప్రపంచం, జీవితం అంటే చూపించిన పుస్తకం అలెక్స్ హేలీ రాసిన ' ఏడు తరాలు ' .
మిగతా భాగం ఈ లింకులో చూడండి. http://pustakam.net/?p=10662
మిగతా భాగం ఈ లింకులో చూడండి. http://pustakam.net/?p=10662



19 కామెంట్‌లు:
I have tried to introduce this book in my blog long back, some how failed. I have referred about the same in my blog. Thank u very kind of you for introducing a very good book.
ఇది చదువుతుంటే నాకు దానిని వెంటనే చదవాలనిపిస్తోంది! శీర్షికని బట్టి ఇది ఆంధ్ర ప్రజల కథ అని ఊహించాను! కాని నా ఊహ తప్పయింది!
ఆసక్తికరం గా రాశారండీ.తప్పకుండా చదవాలి అనిపిస్తుంది.
పరిచయం చేసినందుకు ధన్యవాదాలు
తప్పకుండా ఈ పుస్తకం కొని చదవాలనిపిస్తుంది. ఒక మంచి పుస్తకం గురించి తెలియజేసారు.థాంక్యూ.
నేను ఈ నవల ఎన్ని సార్లు చదివి ఉంటానో. నా దగ్గర భద్రంగా దాచుకున్నాను కూడా . తరతరాల బానిసత్వం కల్లు అట్టినట్లు ఉంటుంది. మీ నవలా పరిచయం చాలా బాగుంది.
good intro
మంచి పుస్తకం ఎప్పుడో చిన్నప్పుడు చదివిన పుస్తకం. మళ్ళీ ఒకసారి చదవాలి.పరిచయం బాగుంది
కుంటా కింటే తో పాటూ మనమూ జఫూరు నుంచి అమెరికా వరకూ ప్రయాణించి, అతనితో పాటు ఏడ్చి,కసి పెంచుకుని,ప్రేమించి,అలసి పోతాం. కానీ చివరి వరకూ అతనిలో వదలని ఆ స్వేచ్ఛా కాంక్ష ఉంటుంది చూశారూ...అద్భుతం నిజంగా!
కానీ ఆ తర్వాత కొందరి వల్ల విన్నదేమిటంటే ఇదంతా కల్పితమనీ, అసలు హేలీకి అలాంటి గతమేమీ లేదనీనూ!నిజమో కాదో తెలీదు మరి!
అయినా సరే, అంత చిక్కని కథను సృష్టించాలంటే అవుతుందా ఎవరి వల్లనైనా?
ఈ నవల ఇంగ్లీష్ లో కష్టపడి చదివాను. కానీ తెలుగులో సహవాసి అనువాదం అంత అందంగా నాకు ఒరిజినల్ కూడా అనిపించలేదు.
ఏ అనువాద నవలైనా సరే, అనువాదం సహవాసి అని ఉంటే ఆ నవల ఎవరు రాశారో నాకు అనవసరం. అది ఎలాంటి నవలైనా సరే, చక్కని చిక్కని తెలుగులో వీధరుగు మీద కూచుని చెప్తున్నట్లే సొగసుగా ఉంటుంది సహవాసి అనువాదం! ఐ లవ్ హిమ్
ధన్యవాదాలు వనజవనమాలి, భాను, బాలుగారు.
ఇది చదువుతుంటే నాకు తప్పకుండా చదవాలి అనిపిస్తుంది.
Ur write-up is too good that U can inspire anyone.
ఈ పుస్తకం onlineలో Available ఉందా చెప్పండి Please. మాకు ఇక్కడ తెలుగు పుస్తకాలు అస్సలు దొరకవు.
@సుజాత గారు
ఏమోనండీ నేను మొదట తెలుగే చదివాను. తరువాత ఇంగ్లీషలో చదువుదామని ప్రయత్నించినా నా వల్ల కాలేదు. సహవాసి అనువాదం నా మనసుకు అంత బాగా హత్తుకుంది.
ధన్యవాదాలు కష్టేఫలే, రసజ్ఞ, రాజ్ కుమార్ గారు. చాలా మంచి పుస్తకం ఇది, తప్పకుండా చదవండి. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు అచ్చు వేశారు. అ కదా అనువాద పుస్తకం కదా రసజ్ఞగారూ అందుకే పేరు అలా ఉంది. ఇది ఏడు తరాలకి సంబంధించిన కథ కదా అందుకే దానికి ఆ పేరు కరెక్ట్ గా సరిపోయింది
ధన్యవాదాలు శ్లోకాశాస్త్రిగారు. క్షమించాలి ఆన్ లైన్ లో ఈ పుస్తకం గురించి నాకు తెలియదు. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారికి ఒక బ్లాగ్ ఉంది. అందులో మీరు అడిగి చూడండి. పుస్తకం అచ్చు వారిదే కాబట్టి వారు మీకు పంపించగలుగుతారేమో
నిజంగా నిజం. ఇది చదివి కనీసం ఒక్కసారైనా కళ్ళు తడవకపొతే వాడు మడిసే కాడు అని నా నమ్మకం. నా మనసుకు నచ్చిన పుస్తకాలలో మొదటి స్థానం దీనిదే.
సుజాతగారు అన్నట్టు హేలీకి అలాంటి గతం ఏమీ లేదని నేనూ విన్నాను. అందులో ఎంత వరకూ నిజం ఉందొ నాకు తెలియదు గానీ ఇలాంటి రచన చేసినందుకు తను ధన్యుడు.
అవునండీ శంకర్ గారు మీరు చెప్పింది నిజమే. నేనూ ఈ పుస్తకం చదివిన ప్రతీసారి ఏడుస్తాను. హేలీ గురించి మీరు చెప్పింది నేను కూడా ఒప్పుకుంటాను.
వేరు వేరు చదువులకోసం విడిపోతున్నపుడు, గుర్తుగా నేను 'చెకోవ్ కథలు' ఇస్తే, నా స్నేహితురాలు 'ఏడుతరాలు' ఇచ్చింది. మొదటి సారి చదివిన తర్వాత కలిగిన అనుభూతి గుర్తు చేశారు.
Thank you
చాలా జీవితాలు అలాగే ఉంటాయి మనో. అణగారిన వర్గాల బ్రతుకుల్లో ఏడుతరాల్లాంటి కథలే కనిపిస్తాయి. రాసుకునేంత స్థాయి విద్య వారికింకా అందడం లేదు. ఇక ఆఫ్రికాలో అయితే ఇప్పటికీ పరిస్థితిలో మార్పులేదు. వాటిని పుస్తకం రూపంలోకి తెచ్చిన హేలీ నిజంగా గ్రేట్.
మీరీ పోస్ట్ రాశాక ఎలా అయినా ఈ బుక్ చదవాలనుకున్నాను. నాల్రోజుల క్రితం కొన్న ఏడుతరాలు ని నిన్న మొదలెట్టి రెండు నిమిషాల క్రిందట పూర్తి చేశాను.
నా ఫీలింగ్స్ ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో తెలియటం లేదు. కానీ వెంటనే మీకు చెప్ప్పాలనిపించిందండీ.
ఇంత గొప్ప పుస్తకాన్ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు
రాజ్ కుమార్ గారు మొత్తానికి పుస్తకం చదివారన్నమాట. మీకు అలాంటి భావం కలగడం చాలా సహజం. నాకైతే చదివిన ప్రతీసారి అలాగే అనిపిస్తుంది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి