8, అక్టోబర్ 2010, శుక్రవారం

వ్యాస కౌముది

                               శ్రీపాదవారి మీద ఇద్దరి ప్రభావం అత్యధికంగా ఉంది అనిపిస్తుంది. వారిలో ఒకరు వీరేశలింగం పంతులుగారు అయితే...రెండవ వారు గురజాడ. వీరేశలింగం గారి వల్ల ఆధునిక భావాలు అందిపుచ్చుకుంటే...గురజాడ నుంచి భాషను తీసుకున్నారు. అత్యంత ఆధునికమైన భావజాలాన్ని మరింత ఆధునికమైన , అద్భుతమైన వాడుక భాషలో కథలుగా రచించి తెలుగుజాతికి అందించిన వారు శ్రీపాద. అన్యభాషా సాహిత్యాల ప్రభావం ఏ మాత్రం లేకుండా స్వీయ ప్రతిభతో తెలుగువారికి నవ్య దృక్పథాన్ని అందించినది కేవలం వీరొక్కరే అని చెప్పవచ్చును.

                          ఇది నా ఎంఫిల్ సిద్ధాంత వ్యాసావళి. కౌముది లో ఇది సీరీయల్ గా ప్రచురితమౌతోంది. సెప్టెంబర్ సంచిక నుంచి మొదలయ్యాయి.  మిగతా వ్యాసాలు ఈ కింది లింకులో వ్యాసకౌముది అనే చోట ఉంటాయి, చదువగలరు. www.koumudi.net