తెలుగు సినిమా నానాటికీ దిగజారిపోతోంది. అర్ధం లేని కథలు, అర్థం లేని పాటలతో ప్రేక్షకుల మెదళ్ళను తొలిచేస్తున్నాయి. ప్రజల మనసుల్నేగాక, మెదడుల్ని కూడా కబళించే అయోమయ యుగానికి చెందిన సినిమాలు, ఔచిత్యంలేని పేర్లు తగిలించుకుని మార్కెట్‌లో దిగుతున్నాయి. ఏం తీస్తున్నారో...ఎలా తీస్తున్నారో తెలియని అయోమయానికి గురిచేస్తున్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా పతనావస్థలో ఉన్న తెలుగు సినిమా నానాటికీ దిగజారుతూనే ఉంది కాని ఏ మాత్రం ఆశాజనంగా లేదు.
తెలుగు సినిమా ఎంత దిగజారుడు స్థితిలో ఉందో ఈ కింది వాటిని పరిశీలిస్తే తెలుస్తుంది. వాటిలో మచ్చుకకు కొన్ని ఇక్కడ: ‘‘రెండు తోకల పిట్ట’’, ‘‘ ఎదురింటి మొగుడు - పక్కింటి పెళ్ళాం’’, ‘‘దొంగ మొగుడు’’, ‘‘ ఉమ్మడి మొగుడు’’, ‘‘కిరాయి అల్లుడు’’ ‘‘ఇంట్లో ఇల్లాలు - వంటింట్లో ప్రియురాలు’’‘‘ఆయన కిద్దరు’’, ‘‘ఏవండీ, ఆవిడొచ్చింది’’. ‘‘నాతో వస్తావా’’, ‘‘జంబలకిడి పంబ’’, ‘‘ఆ ఒక్కటీ అడక్కు’’, ‘‘మా ఆవిడ మీదొట్టు మీ ఆవిడ చాలా మంచిది’’, ‘‘తప్పు చేసి పప్పు కూడు’’, ‘‘అదుర్స్’’, ‘‘శీనుగాడు చిరంజీవి ఫ్యాన్’’, ‘‘ప్రేమించుకుందాం, రా’’, ‘‘పెళ్ళిచేసుకుందాం, రా’’ (పిల్లల్లి కందాం, రా! ఇదే కాదా తర్వాత రావాలి ….!) ‘‘అక్క మొగుడు - చెల్లెలి కాపురం’’ - వినడానికే ఈ పేర్లు అసహ్యంగా లేవూ? ఇక పాటల్ని కూడా పరిశీలిస్తే, సాహిత్యపు విలువలు ఏ స్థాయిలో ఉన్నాయో గమనించవచ్చు. అడవి రాముడులోని ‘‘ఆరేసుకోబోయి పారేసుకున్నా’’ పాటతో తెలుగు సినిమా పాటల పతనం ప్రారంభమయిందని చెప్పాలి.
‘‘సూదిలో దారం - సందులో బేరం’’
‘‘నీ క్కావలసింది నా దగ్గర ఉంది’’
‘‘అడగనా …. అడగనా, నోరు విడిచి అడగరానిది’’
"పట్టుకో పట్టుకో రెండు పట్టుకో’’
‘‘నూకలిస్తా మేకలు కాస్తావా,
రవికలిస్తా రాతిరి కొస్తావా?’’
అశ్లీల పదాలు, బూతు, ద్వంద్వార్థాల పదాలు పాటల్లో, మాటల్లో చోటు చేసుకుంటున్నాయి.
గొప్పింటి అల్లుడు:
.............................................
‘‘మూడొచ్చి కూర్చుంది ఆ పద్దయో ఆ కాస్త కానీయరో’’.
రాజకుమారుడు:
...........................................
‘‘కన్నులతో కన్నెరికం తీర్చిన వాడా
పైటలలో పాటలెన్నో దాచిన దానా’’
సమరసింహారెడ్డి:
.........................................
‘‘నందమూరి నాయకా, అందమైన కానుక
బుల్లో బొంగరం తిప్పేయనా నీ బంగారి బొడ్డుమీద’’
కన్యాదానం:
.............................
‘‘అందాలే ఊరిస్తుంటే ఆగదు నా మనసు
ఆ సీనే మొదలయిపోతే స్టాపంటూ లేదంటూ’’
అల్లరి అల్లుడు:
................................
‘‘రైక చూస్తే రాజమండ్రి
పైట చూస్తే పాలకొల్లు’’
మాయలోడు:
....................................
‘‘మనసు పట్టు తప్పింది.
వయసు గుట్టు తడిసింది.’
ఘరానా మొగుడు:
...............................................
‘‘ఓంతమ్మా ఓంతమ్మా షేపులు అంతంత ఉన్నాయి ఎత్తులు బోలోబోలో
నీ కన్ను పడ్డాక ఓరయ్యో. పొంగేస్తున్నాయి గుత్తులు చలోచలో’’
నా అల్లుడు:
.................................
‘‘కన్నుకొడితే వచ్చేయనా
కన్నె పొంగులిచ్చేయనా
హే జారేసుకో పైట జారేసుకో
పరువాలు నామీద నూరేసుకో’’
అన్నయ్య:
...................
‘‘మండపేట కుర్రదాన్ని ఓ బావయ్యో
మనీ పర్సు చూస్తే తస్సదియ్యా మహా ఇదయ్యో’’
ఆది:
..............
‘‘పైన ఎన్ని అందాలున్నా లోపలుందీ తెలిసేదెట్టా
నా ఒళ్ళోకి వస్తావా, నే కోరింది కొరికి ఇస్తావా?’’
అక్కడమ్మాయి - ఇక్కడ అబ్బాయి:
...........................................................................
‘‘జఘనముతో జగడములో చకచక సుఖపడదాం’’
తెలుగు పాటల్లో ఇంగ్లీషు, హిందీ పదాలు జోరందుకుంటున్నాయి.
బద్రి:
.............
‘‘వై డు యు వర్రీ వేర్ యు బోర్స్ ఆర్ యు దేర్ బ్రదర్’’
‘‘ఏ దేశ్ ద ష్యారా ప్యారా కిన్ కీ నజర్ లగీ సే’’
అర్థంలేని మరో పాట:
.................................................
‘‘కాలేజీకి టీనేజీకి స్వీటేజీకి హటేజీకి కట్టెయి తకధిమి
లవ్వేజీకి నవ్వేజీకి కన్యాజీకి మారేజీకి పెట్టెయి పెదరిమ’’
శంకర్ దాదా ఎం. బి. బి.యెస్ :
............................................................
‘‘చైలా చైలా చైలా …. నేను వెంటపడ్డ పిల్లపేరు లైలా’’
ఏమాత్రం మాధుర్యం లేని, పసలేని పాట. పోనీ - ‘‘నేను ప్రేమించే పిల్ల పేరు లైలా’’ అని అంటే ఎంతో బావుణ్ణు గదా! ‘‘వెంటపడ్డ’’ అనే పదాలతో నాయకుని స్థాయి, హుందాతనం దిగజారిపోలేదా? నిజం చెప్పాలంటే, ఇలాంటి చౌకబారు నటనలు చాలా అనారోగ్యకరమైనవే కాదు చాలా ప్రమాదకరమైనవి కూడా.
ముఖ్యంగా, ఈనాటి సినిమా పాటలు …. అవి ఏవైనా పాటలా? అయ్యో రామ….! వెరైటీ గొంతులు….! అర్థంకాని పదజాలంతో సాహిత్యం!! కలవరపరిచే వాయిద్య ధ్వనులు!!! ఈనాటి రచయితలు, గాయకులు, సంగీత దర్శకులు అసలు ఏమనుకుని పాటలు చేస్తున్నారో అర్ధం కావడం లేదు. ప్రేక్షకుల ‘‘అభిరుచి’’ అనే వంకతో అందర్నీ పక్కదారి పట్టిస్తున్నారు. విలువల్లేని సాహిత్యం, రణగొణ ధ్వనుల సంగీతం ఎక్కువకాలం నిలబడవు. అప్పటికి వింటున్నా తరువాత కాలంలో ఆ పాటలన్ని మర్చిపోతున్నారు. కొత్త పాటలు రాగానే ముందు పాటలు గోవింద….! ఈ పరిస్థతి పోవాలంటే సంగీత దర్శకులు పాటలోని మాటలు వినిపించేలాగ మంచి ట్యూన్ కట్టాలి. ఆ బాధ్యత దర్శకులదే. మంచి ట్యూన్ లేకపోతే పాట బ్రతకదు. అది గుర్తుంచుకోవాలి. అలాగే పాటల రచయితలు మంచి పదాలతో, మంచి తెలుగుతో పాటలు రాయాలి. మరొక ముఖ్యమైన విషయం రచయితలు ఇంగ్లీషు, హిందీపదాలను తెలుగులో చొప్పించి పాటల్ని రాస్తున్నారు, ఇలాంటి పాటలను శ్రోతలు కొంత కాలమే వింటారు. తర్వాత చాలా తొందరగా మర్చిపోతారు. దీనిని కూడా వారు దృష్టిలో పెట్టుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటేనే పాటలు దశాబ్దాల కాలం పాటు బ్రతుకుతాయి. అలనాటి రచయితలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రాశారు కాబట్టే అప్పటి పాటలు ఇప్పటికీ మన మనుసుల్లో కదలాడుతున్నాయి.
నేటి సినిమాలను వ్యాఖ్యానిస్తూ ప్రముఖ నటులు శ్రీ జగ్గయ్యగారు ఏమన్నారో చూడండి: ‘‘ఈ మధ్య వస్తున్న తెలుగు చిత్రాలను చూస్తుంటే పాతతరం నటులైన మేము రాజీపడలేకపోతున్నాం. కుటుంబంతో సినిమాకు పోలేని పరిస్థితి. కాసులు కూడగట్టుకోవాలను కోవడం నిర్మాతల అవివేకం. ఈ చిత్రాలని విద్యార్థులే బహిష్కరించి సమాజానికి మార్గదర్శకులు కావాలి’’. (10-7-1996, ఆంధ్రప్రభ సచిత్రవార పత్రిక)
ఈ సందర్భంలో శ్రీ గుమ్మడి వెంకటేశ్వరరావు గారు చేసిన వ్యాఖ్య కూడా గుర్తు పెట్టుకోవలసినదే: ‘‘ప్రస్తుతం ఒక వింత ప్రవాహంలాగా అతి వేగంగా కొట్టుకు పోతున్న నేటి సినిమా రంగంలో ఎంటర్‌టైన్‌మెంట్ అంటే అసభ్యం, అశ్లీలం, ద్వంద్వార్థాల మాటలు, బూతు మాటలనే అర్థం చెప్పుకుంటున్న ఈ రోజుల్లో నాలాంటి చాదస్తపు కళాకారుడు కొట్టుకు పోగలడే తప్ప ఎదురీదలేడు.’’ (14-4-1997 ‘‘ఈనాడు సినిమా’’.)
అక్కినేని నాగేశ్వరరావుగారు ఏమన్నారో చూడండి: ‘‘….సినిమాల్లో అయితే సాంకేతిక విప్లవం కనిపిస్తోంది. గ్రాఫిక్ ప్రభావం ఎక్కువైంది. కథ పలుచబడింది.’’ (‘‘ఈనాడు సినిమా’’ జనవరి 13. 2006)
సుప్రసిద్ధ నటీమణి భానుమతి గారి వ్యాఖ్య కూడా పదును గానే ఉంది: ‘‘ఈనాడు డబ్బులకోసం బూతుచిత్రాలు తీస్తున్న నిర్మాతల కంటే, పొట్ట కూటికోసం ఒళ్ళు అమ్ముకుంటున్న ఆడది నయం అనిపిస్తోంది’’. (7-8-1996. ‘‘ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక’’.)
చూశారు కదా అందరి యెదుటా ఆనాటి నటులు అన్నమాటలు...కనీసం ఇవి చదివి....లేదా విని అయినా ఇప్పటి మన దర్శకులు, సంగీత దర్శకులు, రచయితలు మారాలి. కళ్ళు తెరిచి విశిష్ట ప్రస్థానం కల తెలుగు సినిమాను బ్రతికించాలి.
అయితే అధోగతిలో ఉన్న తెలుగు సినిమాలో అప్పడప్పుడూ కొన్న ఆణిముత్యాలు వెలువడుతున్నాయి. వేటూరి వంటి రచయితలు, రాధాకృష్ణ వంటి సంగీత దర్శకులు తెలుగు సినిమా పాటలన్ని సజీవంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉప్పొంగెనే గోదావరి, యమునా తీరం....., కనివిని ఎరుగని ఈ కల వంటి పాటలు గంజాయి వనంలో తులసి మొక్కల్లా పరిమళిస్తున్నాయి.



12 కామెంట్‌లు:
బాగా రాసావు....ఈ మధ్య వస్తున్న కొత్త తెలుగు సినిమా పాటల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
మొన్న నాతో ఎవరో అన్నారు. "అలిగితివా సఖీ ప్రియా, అలకమనవా" అంటా అర్థం చేసుకోవడానికి ఎంతో కష్టంగా ఉంటుంది. అదే "ఏమా కోపమా, లేటయ్యిందనా" అంటే సులువుగ అర్థమవుతుంది అని....ప్రకే ఇలా కోరుకుంటుంటుంటే పాట ఏం చేస్తుంది పాపం ! అందుకే మార్పు మనతోనే మొదలవ్వాలి!
‘‘ఈనాడు డబ్బులకోసం బూతుచిత్రాలు తీస్తున్న నిర్మాతల కంటే, పొట్ట కూటికోసం ఒళ్ళు అమ్ముకుంటున్న ఆడది నయం అనిపిస్తోంది’’................చక్కని మాటన్నారు భానుమతిగారు.
మార్పు మనలో కొంత మొదలయ్యిందనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్య కాలంలో నేటి సినిమా పాటలన్ని మెచ్చకునే వారి కంటే తిట్టే వారి సంఖ్యే అధికంగా ఉంటోంది. కాని సినీ నిర్మాతలు, దర్శకులు మాత్రం అది గుర్తించలేని మత్తులో ఉన్నారు. చాలా తొందరలోనే వారిలో చైతన్యం వస్తుందని ఆశిస్తున్నాను.
ఒక్కసారి ఒక్కసారి నొక్కి చూడయ్యో కాదు.
ఒక్కసారి ఒక్కసారి నవ్వి చూడయ్యో.
సిరివెన్నెల గారు ఇంకా అంతస్థాయికి దిగాజారలేధనుకుంటా.
blog look excellent
అవునా రాహుల్ గారు....నాకు నొక్కి అనే వినిపించింది. బహుశా సంగీతం ప్రభావమేమో. నాకు సిరివెన్నెల మీద అపారమైన గౌరవం ఉంది. ఈ పాట ఆయన రాసారు అని కూడా తెలియదు. ఈ పాటలలో ఆయకు మినహాయింపు ఉంది.
ధన్యవాదాలు వినయ్. ఏం చేస్తాం చెప్పండి...తెలుగు గడ్డలో పుట్టి, తెలుగు మాట మాట్లాడుతూ...తెలుగు చదువుకుని...తెలుగు చచ్చిపోతుంటే చూస్తూ ఊరుకోలేకపోతున్నాను. ఈ విధంగా మనోవేదనను తీర్చుకుంటున్నాను. మీకు అవి ఏ విధంగా మంచి వాక్యాలు అనిపించాయో నాకు అర్ధం కావడం లేదు.
అడవి రాముడులోని ‘‘ఆరేసుకోబోయి పారేసుకున్నా’’ పాటతో తెలుగు సినిమా పాటల పతనం ప్రారంభమయిందని చెప్పాలి.....
వేటూరి వంటి రచయితలు, రాధాకృష్ణ వంటి సంగీత దర్శకులు తెలుగు సినిమా పాటలన్ని సజీవంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు....
పైపాట ఆయన రాసిందేనండి మరి,
పాట రాసాకా,సెన్సారు కత్తిరింపుల ప్రకారం మళ్ళీ తిరగేసి రాసినపాటల్లో ఆయనవే అధికభాగం తెలుగుసినిమా పాటల్లో.ప్రవీణు అన్నట్టు ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం.
రాజేంద్రకుమార్ గారు, హరేకృష్ణ గారు వేటూరి బూతు పాటలను కూడా ఎక్కవు రాశారు కాని అంతే సమానంగా మంచి పాటలను కూడా రాశారు. ఇక్కడ ఉదాహరణకు చెప్పాలని చెప్పాను గాని బూతు పాటలను వేటూరి రాస్తే మంచి నేనడం లేదు. ద్వంద్వార్థం పాటలు ఎంత గొప్పవారు రాసినా తప్పే...
కచ్చితంగా పాటల నిర్మాణంలో నిర్మాతలు, దర్శకులదే ఎక్కువ తప్పుంది హరికృష్ణ గారు. అలాంటి పాలను విని ఆనందిస్తూ మనం కూడా తప్పు చేస్తున్నాము
మన మనోభావాలే పాటలు, డయలగులుగా వస్తున్నాయి, మనిషి మనసు అభివృద్ధి చెందితే, పాటలు మాటలు అభివృద్ధి చెందుతాయి అందుకు గొప్ప వ్యక్తులను పాటించాలి, చెడు తగ్గించుకోవాలి ---- రవిశంకర్ గారు సమన్వయ దృష్టి వ్యవస్థాపకులు
Interesting.
It is easy to take the moral high road. However, if one were really sincere, one will agree that film song has never been epitome of great poetry.
ఇప్పటిదాక రచించబడి చిత్రాఇకరించబడి విడుదలకి నోచుకున్న కొన్ని లక్షల పాటల్లో ఇప్పటికి మన మనసుల్ని కదిలించే కొద్ది వందల పాటలని మినహాయిస్తే - ఇహ మిగిలిందేవిటి? unadulterated purest nonsense.
అందూక్ని ఇప్పుడే ఇది దిగజారింది అనే అభియోగం అసమంజసం.
రెండో విషయం .. మీరు కాలేజికి వెళ్ళిన రోజుకీ, ఇప్పుడు కాలేజి పిల్లల భాష, జీవన శైలికీ తేడా ఉందా? మన చిన్నప్పుడు చూసిన సినిమాలకీ ఇప్పుడొస్తున్న సినిమాలకీ కూడా అదే తేడా .. ఇది సహజమైన ంఆర్పే. అందువల్ల కూడా మనం ముక్కున వేలేసుకోవడం అనవసరం.
ఐనా .. మనలోమాట, మనోజ్ఞ గారూ, ఏదో ఆ వాద్యసంగీతపు హోరులో వినీ వినబడకుండా అర్ధంకాకుండా ఉండిపోయిన పలుకుల్ని ఇలా బట్టబయలు చెయ్యడం మీకు న్యాయమా??
ఏం చేస్తానండీ పాత సినిమాలు, పాటలు నన్ను పట్టుకుని వదలటం లేదు. వాటి మాధుర్యంలో పడి కొట్టుకుపోతున్న నాకు ఇప్పటి సినిమా పాటలు పంటి కింద రాయిల్లా తగులుతున్నాయి. ఆ బాధను ఎలా వెళ్ళక్కాలో తెలీక ఇలా రాసాను. ఏదో నాకు కొంత మన:శాంతి అంతే.
కామెంట్‌ను పోస్ట్ చేయండి