బాలరసాలసాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్
గూళలకిచ్చియప్పుడుపుగూడు భుజించుట కంటె సత్కవుల్
హాలికులైననేమి? గహనాంతరసీమల కందమూల కౌ
ద్ధాలికులైననేమి? నిజదార సుతోదర పోషణార్ధమై.
ఎవ్వనిచే జనించు జగ
మెవ్వని లోపల నుండు లీనమై
యెవ్వని యందుడిందుఁ బర
మేశ్వరుఁడెవ్వఁడు మూలకారణం
బెవ్వఁడనాది మధ్యలయుఁ
డెవ్వఁడు సర్వముఁ దానయైన వాఁ
డెవ్వఁడు వానినాత్మభవు
నీశ్వరునే శరణంబు వేఁడెదన్.
(పోతన, భాగవతం)
భూషలుగావు మర్త్యులకు భూరి మయాంగదతారహారముల్
భూషితకేశపాశ మృదుపుష్ప సుగంధ జలాభిషేకముల్
భూషలుగావు షూరుషుని భూషితుఁజేయుఁ బవిత్రవాణి, వా
గ్భూషణమె సుభూషణము భూషణముల్ నశియించునన్నియున్.
విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పూరుషాళికిన్
విద్యయశస్సు భోగకరి విద్య గురుండు విదేశబంధుఁడున్
విద్యవిశిష్ట దైవతము విద్యకు సాటి ధనంబు లేదిలన్
విద్య నృపాల పూజితము విద్యనెఱుంగని వాఁడు మర్త్యుఁడే.
(భర్తృహరి సుభాషితాలు)
ఆ పురిఁబాయకుండు మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి భా
షాపరిశేష భోగి వివిధాధ్వర నిర్మల ధర్మకర్మ దీ
క్షా పరతంత్రుఁడంబురుహగర్భ కులాభరణంబనారతా
ధ్యాపన తత్పరుండు ప్రవరాఖ్యుఁడలేఖ్య తనూ విలాసుడై.
అటఁజని కాంచె భూమిసురుఁడంబర చుంబి శిరస్సర జ్ఝరీ
పటల ముహుర్లుఠదభంగ తరంగ మృదంగ నిస్వన
స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపిజాలమున్
గటక చరత్కరేణు కరకంపిత సాలము శీతశైలమున్.
(పెద్దన, మనుచరిత్ర)

3 కామెంట్‌లు:
అటజని గాంచె... చదవగానే ఫక్కున నవ్వు వచ్చింది, నా బ్లాగులో మీ కామెంటు గుర్తుకు వచ్చి.
ఇందులో నాలుగు పద్యాలు మా నాన్న గారు నాకు నేర్పారండి చిన్నప్పుడు. ఇప్పుడు గుర్తు లేవనుకోండి.
"ఎవ్వనిచే జనించు.." కూడా నాలుగు పాదాలలో చూపించవలసినది..
భూషలు గావు మర్త్యులకు - సంస్కృత మూలం ఇక్కడ: http://kottapali.blogspot.com/2007/02/blog-post_12.html
ఎందుకోనండీ మొదట నుంచీ ఇలా రాయటమే అలవాటు అయిపోయింది నాకు ఈ పద్యం. అలా రాస్తేనే బావున్నట్టు అనిపిస్తుంది కూడా. భర్తృహరి సుభాషితాల పుస్తకం నా దగ్గర ఉందండీ...అందులో తెలుగు, సంస్కృతం రెండు ఉంటాయి. కాని నా మొదటి ఓటు తెలుగుకే ఎప్పుడూనూ.
కామెంట్‌ను పోస్ట్ చేయండి